Saturday, 31 July 2021

అంతం కాదిది ఆరంభం

అంతం కాదిది ఆరంభం

(ఏకాంకిక)


రచన- పి.సుబ్బరాయుడు.

 

 Stairs going uphill during autumn

  


అంతం కాదిది ఆరంభం

(ఏకాంకిక)

 

ఇందలి పాత్రలు

 

 

1.రవి

2.రాధ

3.భూపతి

4.నరసయ్య

5.పేరయ్య

 

 

 

 

 

అంతం కాదిది ఆరంభం

 

(ఆఫీసు వాతావరణం. ఒక బాస్ ఛేర్ టేబుల్ దాని కిరుప్రక్కలా రెండు స్టాఫ్ సీట్లు,టేబుళ్ళువాటిపై  కొన్ని ఫైళ్ళుఒక స్టూల్‍పై  నరసయ్యా కూర్చొనివుంటాడు)

 

రవి:- (వచ్చి నరసయ్యను చూచి)  నరసయ్యతాతా! మీ రిక్కడ?

 

నరసయ్య:- రవి.. నువ్వా! ఉద్యోగం కోసం వచ్చావా?

 

రవి:- ఔనుతాతా.. ఉద్యొగంకోసం  ఇప్పటికే చాలాచోట్ల ప్రయత్నం చేశా.. లాభం లేదు. చూద్దాం.. వీళ్ళైనా ఉద్యోగం ఇస్తేసరిలేకుంటే ...

 

నరసయ్య:- లేకుంటే..

 

రవి:-మరోప్రయత్నం చెయ్యాలి. ఈ యవస్థ లెన్నాళ్ళో మరి..

 

నరసయ్య:- నిజమేనయ్యా.. నీ యవస్థ చూస్తూవుంటే  నాకూ బాధగా

నేవుంది. మీ అమ్మ వున్నన్నాళ్ళూ యేదో కూలోనాలో చేసి  ఓ 50/- తెచ్చి దాంట్లోనే తానింతతిని నీ కింత పెట్టేది. ఇప్పుడాదిక్కూ లెకపోయె.

 

రవి:- ఏంచేసేది తాతా.. అమ్మచేత పనిమాన్పించియేదోఒక ఉద్యోగంచేసిఆమెనిక కష్టపెట్టకుండా సాకుదామనుకున్నా. నాకా ప్రాప్తంలేదు.  ఆ మాయదారి రోగం అమ్మను మింగేసింది. మీరే వూళ్ళో నలుగురినీ కలుపుకొని సాయం చేసినారు.  లేకుంటే  వూరికే యేడవడంతప్పకనీసం అమ్మను కాటికికూడా సాగ నంపలేక చతికిలబడిపోయినా..(కంట తడిపెట్టును.)

 

నరసయ్య:- ఏడవకు.. దిక్కులేనివాడికి దేవుడే దిక్కు. ఏదో మాకుతోచిన సాయం మేముచేసినాము. నేనుగాకుంటే మరొకడొచ్చి సాయపడేవాడు. దాందేముందిలేగానినువెళ్ళు. బయట పది కుర్చీలు వేయించమన్నారుఇప్పుడే వేసొచ్చినా.  ఆడ కూర్చో  అయ్యగారు పిలవమన్నప్పుడు పిలుస్తాను. అయ్యగారొచ్చే సమయమయిందివెళ్ళువెళ్ళక్కడకూర్చో. (రవి వెళ్ళును)

 

భూపతి:- (సూట్‍కేస్‍తోవచ్చి బాస్‍కుర్చీలో కూర్చొనును. అయన కుమార్తె రాధ ప్రక్కసీట్ లో కూర్చొనును) అమ్మా రాధా.. నేను అర్జెంట్‍గ హైదరాబాద్ వెళ్ళాలి మరి,  ఈరోజు క్లర్క్‍పోష్టుకు ఇంటర్‍వ్యూకు పిలిచాం,  ఒకరిద్దరొస్తే  నువ్వే యింటర్‍వ్యూ చేసేసి సెలెక్ట్ చేసేయమ్మా.. చాలా యింటెల్‍జెంట్ మనకొద్దు. మనమిచ్చే జీతానికి వాళెక్కువరోజులుండరు. ఆవరేజ్ క్యాండిడేట్‍ను సెలెక్ట్ చేసుకోవాళ్ళకీ మనకీ అదేమంచిది.

 

రాధ:- సరే నాన్నా.. యెక్కువమందివస్తే రెండ్రోజులు  వాయిదావేస్తా.. లేకపోతే నేనే సెలెక్ట్ చేసేస్తా.  మీకంతగా పనికిరాడనిపిస్తే  ఓ టూ మంత్స్ చూసి తీసేద్దురు లెండి. మరో క్యాండిడేట్‍ను చూసుకోవచ్చు. అంతేగదాసరే మీరెళ్ళిరండినాన్నా.

 

భూపతి:- సరే నేనెళ్ళొస్తానమ్మా! నరసయ్యా నువిక్కడ జరిగేదంతా గమనిస్తూవుండు. వచ్చినవాళ్ళెవరైనా కాస్తా దుడుగ్గా ప్రవర్తిస్తే సర్దిచెప్పి పంపేయ్అమ్మయికి తోడుగావుండు.

 

నరసయ్య:- అలాగేనయ్యా.. మంచిది మీరు వెళ్ళిరండి. (సూట్‍కేస్‍తో వెళ్ళును)

 

రాధ:- నరసయ్యా.. టైం పదిన్నర అయిందిగదా ఇంటర్‍వ్యూ కెవరైనావచ్చినారేమో చూడు.

 

నరసయ్య:- ఒక్కరొచ్చారమ్మా.. మరో అరగంటలో యింకొంతమంది రావచ్చనుకొంటా..

 

రాధ:- సరే.. వచ్చినతన్ని పిలు పని మొదలుపెడదాం.

 

నరసయ్య:- సరేనమ్మా.. (బయటకు వెళ్ళును)

 

రవి:- (వచ్చి) గుడ్ మార్నింగ్ మేడం. (నమస్కరించును రాధ కూర్చొనమని కుర్చీచూపును. రవి కూర్చొనును)

 

రాధ:- వెరి గుడ్ మార్నింగ్.  ఆఁ మీ పేరూ..

 

రవి:- రవి మేడం. ఇవిగోండి నా సర్టిఫికేట్లు.

 

రాధ:- (సర్టిఫికెట్లు అందుకొని  చూచి పెదవి విరచి) మార్కులు ఆడికాడికొచ్చి పాసయ్యాననిపించారు. మా ఆఫీస్‍అకౌంట్స్ చూడగలరా అని?

 

రవి:- నేనుండే పరిస్థితుల్లో అంతమాత్రం చదవడమే కష్టమైంది మేడం. నేను చాలాయిబ్బందుల్లో వున్నానుకష్టపడి పనిచేస్తాను. అకౌంట్స్0టే .. మీరు కాస్తా చెబితే  నేర్చుకుంటాను.

 

రాధ:- బాగానేవుంది.. మేము నేర్పుతూ కూర్చొంటేయిక పనులైనట్లే.

 

రవి:- అలా అనకండి మేడం.. కాస్తా దయచూపండి. పని నేర్చుకుంటాను. మిమల్ని విసిగించను. నాకోఅవకాశమివ్వండి.  ప్రస్తుతం యేఆధారం లేదు. పస్తులుండటం నావల్ల కావడంలేదు మేడం. (నరసయ్య వింటూ కంటతడి పెడతాడు)

 

రాధ:- (నరసయ్యను చూచి) యేం నరసయ్యా.. ఆ కన్నీరేమిటీ..

 

నరసయ్య:- (కళ్ళు తుడుచుకొని) యేంలేదమ్మా.. నలుసు పడింది.. అంతే.. అంతే..

 

రాధ:- అంతేగదా.. వెళ్ళి మొగం కడుక్కొనిరా..

 

నరసయ్య:- అక్కరలేదమ్మా.. నలుసు పోయింది.  ఇప్పుడు బాగానేవుంది మీపని కానివ్వండి.

 

రాధ:-(సర్టిఫికెట్స్ తిరగేస్తూ) అరే.. ఇదేమండీ.. ఇక్కడ తండ్రి పేరుండాల్సినచోట యశోదమ్మ అనివుంది. అలాయెందుకు రాశారు.

 

రవి:- అది సన్‍ఆప్ యశోదమ్మ మేడం.

 

రాధ:- అంటే?

 

రవి:- అంటే తండ్రి పేరు తెలియదు మేడం.  ఐనా యీ విషయం ఉద్యోగనికి అవసరంలేదనుకుంటాను. పరవలేదు మీరు ఓపిగ్గా వింటానంటే నాకు చెప్పడానికభ్యంతరం లేదు.

 

రాధ:- ఇంటరెస్టిం‍గ్ ..

 

నరసయ్య:- చెప్పబ్బాయ్రాధమ్మగారు చాలామంచివారు. వింటారు. నీకు సహయం చేస్తారు.

 

రాధ:-నరసయ్యా నీవితనికి రెకమండేషనా?

 

నరసయ్య:- లేదమ్మా.. అదేంలేదు.. మీయిష్టం

 

రాధ:- సరే.. చెప్పకూడని విషయమనుకుంటే వదిలేయండి రవిగారు.

 

రవి:- నాజీవితంలో చెప్పకూడనిదీరహస్యంగా వుంచదగిందీ యేమీలేదు మేడం. నిజంచెబుతున్నానుమానాన్న యెవరోనాకు తెలియదు. నాతల్లి నాకుచెప్పలేదునేనూ అడగలేదు. ఆమె చెప్ప కూడదనుకొన్న విషయం అడిగి నేనామెను బాధ పెట్టాలనుకోలేదు. నాకర్థమైన విషయమొక్కటే. మాతల్లి మోసగించబడింది. నన్నుగన్నది. నాజన్మకు కారణమైన అతన్నే తనభర్తగా భావించింది. అతనికిబ్బంది కలిగించగూడదని మౌనంగా వుండిపోయింది. నాతల్లి అమాయకురాలు. శాపగ్రస్థురాలైన దేవత. ఆమె బిడ్డనని చెప్పుకోవడానికి నేను సంకో చించడంలేదు. సంతోషిస్తున్నా.

 

రాధ:-అయితే ఇప్పుడామె ..

 

రవి:- లేదు. నన్ను దిక్కులేనివాడినిచేసి వెళ్ళిపోయింది. చనిపోయింది.

 

రాధ:- ఐయాం సారీ.. ఎక్స్‍ట్రీంలీ సారి. మిమ్మల్ని బాధ పెట్టాను.

 

రవి:- లేదు మేడం. మీరునన్నేమీ అనలేదు. నామనస్సు విలవిలలాడే మాటలెందరోయెన్నిసార్లో అన్నారు. బేవారస్ అన్నారు. వేశ్యకొడుకన్నారు. ఖాతరుచెయ్యలేదు. నాతల్లి కడసారి కొడుకా నీవు నాకడుపున పుట్టిగదా యిన్ని మాటలుపడుతున్నావు. నేనేమిచేసేది నాయనాఅంటూ యేడ్చింది. అప్పుడు బాధ పడ్డాను. నాతల్లి నాపుట్టుకకు రోదించింది అందుకు.. అందుకు బాధ పడ్డాను. మేడంఇందులో నాతప్పేమిటి. నాతల్లి తప్పేమిటి. ఒక మోసగాడిచేతిలో మోసపోయింది నాతల్లి. అందుకు నేనా బాధ్యుణ్ని. నన్నెందుకు లోకం నిందిస్తోంది. నేనుచేసిన నేరమేమిటి. నాకెందుకీ శిక్ష.

 

రాధ:- కూల్‍డౌంన్.. కూల్‍డౌంన్. నేను మీతో మరొకసారి మాత్లాడతాను. మీరికవెళ్ళవచ్చు.

 

రవి:-థ్యాంక్స్ మేడం నాకథ ఓపిగ్గా విన్నారు. అసహ్యించుకోలేదు. ఇక ఉద్యోగమా మీ యిష్టం. మీపనికి తగిన వారినెన్నుకోవచ్చు. నాకే యిమ్మనడం తప్పేగావచ్చు. నా అవసరం నాచేత అలా మాట్లడించింది. యేమనుకోకండి. నమస్తే! వస్తాను. (రాధ కాస్త ఆలోచనలో పడుతుంది రవి వెళ్ళిపోతాడు.)

 

నరసయ్య:- మరొకరిద్దరు వచ్చినట్లున్నారు పిలవమంటారామ్మా?

 

రాధ:- ఏమో నరసయ్యా.. నాకిక ఇంటర్‍వ్యూలు చేయబుద్ధి కావడంలేదు.

 

నరసయ్య:- ఎందుకమ్మా.. యిటువంటి కథలింకెన్ని వినాల్సి వస్తుందోననాచింతించకమ్మా.. అన్నీ యిటువంటి కథలేవుంటాయా?  ఉండవులేతల్లీ.

 

రాధ:- సరే.. మరొకర్నిపిలు. (నరసయ్య బయటకు అడుగేస్తాడు)

 

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

 

(ఆఫీస్- భూపతిరాధరవి కూర్చొని వుంటారు రవి లేచి కొన్ని ఫైళ్ళు భూపతి టేబుల్‍పైన పెడతాడు. వాటినందుకొని చూస్తాడు భూపతి)

 

భూపతి:- పరవాలేదయ్యా రవిపని తొందరలోనే వంటబట్టించుకొన్నవ్. మా రాధ సెలక్‍షన్ కరక్టే. ఇలాగే పనిచేసుకో పైకొస్తావ్.

 

రవి:- తెలియని విషయాలు రాధగారు ఓపిగ్గా చెబుతున్నారండి. అందుకే యిలా చేసుకపోతున్నాను. థాంక్స్ సార్. జాగర్తగా పనిచేసుకుంటాను.

 

రాధ:- అట్టే యింటెల్‍జెంట్ కాదనుకొన్నానుగానీ  పర్వాలేదునాన్నా. చెప్పింది గ్రహించి పనిచేసుకపోతున్నాడు.

 

భూపతి:- వెరీగుడ్ కీపిటప్ మై బాయ్ కీపిటప్.

 

రవి:- అలాగే సార్.

 

పేరయ్య:- (వచ్చి) నమస్కారం భూపతిగారూ.. నమస్కారం. రెండ్రోజుల నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటూనేవున్నా. ఇదిగో యిప్పటికి కుదిరింది.

 

భూపతి:- పేరయ్యగారూ రండిరండి.. నమస్కారం కూచోండి. ఆఁ యేందీసుకుంటారు. కాఫీటీహార్లిక్స్..

 

పేరయ్య:- యేమక్కరలేదండిఓ సంబంధం కుదిర్చి నిశ్చితార్థం డేట్ బెట్టించి వస్తున్నా. అక్కడ ఫుల్‍గా టిఫిన్ బెట్టించారు. ఒకత్రేపు త్రేంచి కాస్త కడుపులో జాగా యేర్పరచి మాంచి స్ట్రాంగ్ కాఫీతో ఆ జాగాకూడా నింపి చక్కగా యిటే వస్తున్నా. యిప్పుడేం అక్కరలేదు.

 

భూపతి:- సరే.. మరిమాకు సరిపోతాయనుకున్న ఆ రెండు సంబంధాల విషయమేంజేశారు.

 

పేరయ్య:- ఇంకా మనచేతిలోనేవున్నాయ్. మీరు ఊ అంటేచాలు ముహూర్తాలు పెట్టించేస్తాను. సరే దాంతోపాటే యీసంబంధం కూడా చూడాండి. (సంచిలోంచి ఆల్బం తీసి అందులోని ఓ ఫోటో తీసిస్తూ) ఫోటో వెనకే డీటెయిల్స్ వున్నాయి చూడండి. ఈ సంబంధమైతే ఇల్లరికానికైనా వారు సిద్ధమే. ఆలోచించండి నిర్ణయమైతే తొందరగా తీసుకోండి. అదేమోగాని నాచేతికి ఫోటో యిచ్చారంటే శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తే మరి. అదీ విషయం.

 

భూపతి:- సరే నేనూ తొందరలోనే అమ్మయికి పెళ్ళిచేద్దామను కుంటున్నాలే. పేరయ్యగారుఆ రెండు ఫోటోలు కూడా యిటివ్వండి. అమ్మయిచూస్తుంది. వీటిలో యేదోఒక సంబంధం ఖాయంజేసుకొందాం.

 

పేరయ్య:- ఏవీ.. ముందు మీతోచెప్పినవేగాఆ ఫోటోలు యివిగో ప్రక్కనే వుంచా.. (తీసి భూపతికిస్తాడు)

 

భూపతి:- ఇవిగోమ్మా.. ఈ ఫోటోలుచూడు. ఈ మూడవదైతే నేనను కొన్నట్లు ఇల్లరికం గూడా కుదురుతుందంటున్నారు పేరయ్యగారు. చూచి యేదోఒకటి ఓకే చెయ్యి అవతలి విషయాలు మాట్లడతాను. (ఫోటోలు రాధ కందించును)

 

పేరయ్య:- ఫోటోలు అమ్మయి చూస్తూవుంటుందిమనం ఒకటిరెండు విషయాలు ప్రత్యేకంగా మాట్లాడు కోవాలియిక్కడ ఆఫీసులో వద్దుఇంట్లోకెళ్ళి మాట్లడుకుందాం పదండి.

 

భుపతి:- సరే పదండి. అమ్మా రాధా! నువ్వు యేదోఒకటి యీరోజే ఓకే చేసేయమ్మా. పదండి పేరయ్యగారు .. (ఇద్దరూ వెళ్ళుదురు)

 

రవి:- సంతోషమండి రాధగారు. తొందరలోనే మాకు వివాహ భోజనముందన్న మాట. మా ఫ్రెండ్స్‍కొక మ్యుజిక్‍సంస్థ వుంది. వాళ్ళతో మాంచి కచేరీ చేయిస్తాను మీపెళ్ళికి.

 

రాధ:- నాకంటే మానాన్నకంటే తొందర మీకే యెక్కువున్నట్లుందేనన్ను బయటికి పంపించడానికి. మిమ్మల్ని నేనంతగా సతాయిస్తున్నానా..

 

రవి:- ఏంతమాటనేశారండి. యేమండి నాకు మీవల్లనే ఒక ఆధారం దొరికింది. మిమ్మల్ని వదిలించుకోవడమా?  ఏందుకండి.. ఆమూడో సంబంధం ఆలోచించండి. మాకో కొత్తబాసూ వస్తారు. మీరూ మాకు దూరంకారు. ఏమంటారు?

 

రాధ:- మరి మానాన్నా..

 

రవి:- ఇంక రిటైర్ చేసేసేయండి. పాపం పెద్దాయనరెస్ట్ తీసుకుంటారు. మీకు పెళ్ళైఒకటిరెండేళ్ళలో మనవణ్నో మనవరాలినో అందిస్తే  హాయిగా ఆడుకుంటారు.

 

రాధ:- ఏమిటీ యిండైరెక్టుగా చాలా సలహాలిచ్చెస్తున్నారే. ఒకనెలలోనే చాలా తెలివిమీరిపోయారు. ఇది నా స్వవిషయం. నేనే నిర్ణయం తీసుకోగలను. ఆమాత్రం తెలివితేటలు నాకూ వున్నాయ్.

 

రవి:- సారీ.. రాధగారూ.. క్షమించండి. హద్దుమీరినట్లున్నాను. నన్నునేను అదుపులో వుంచుకుంటాను. ఇంకెప్పుడూ అలాజరగదు. ఐ యమ్ సో సారీ.

 

రాధ:- (నవ్వి) రవిగారూ ఫీల్‍గాకండి. నెనేదో వూరికే అలాఅన్నాను. మీరిచ్చిన సలహాలో తప్పేంలేదుకలిసి పనిజేస్తున్నాంఆమాత్రం చొరవ తీసుకోవడంలో తప్పేముంది. రిలాక్స్.

 

రవి:- అమ్మయ్యా! మీరు నవ్వారు. చాలు. మీరెప్పుడూ యిలాగే నవ్వుతూ సంతోషంగా వుండాలి. అదే మాక్కావలసింది. ఛీఫ్ అకౌంటెంట్ కీ పేపర్లిచ్చి ఒకమాట మాట్లాడిరావాలి ఆయన సెల్‍దాకా వెళ్ళొస్తాను. కాస్తా ఆలస్యమైతే అట్లే ఇంటికెళ్ళిపోతాను. (వెళ్ళును)

 

రాధ:-నరసయ్యా.. నరసయ్యా.. (కాలింగ్ బెల్ నొక్కును)

 

నరసయ్య:- (వస్తూ) యేంకావాలమ్మా!

 

రాధ:- నరసయ్యతాతా! మీరు నన్ను పెంచిపెద్దచేశారు. నాకు అమ్మఒకటుండేదన్న జ్ఞాపకమే రకుండా లాలించారు. నిజమేకదా!

 

నరసయ్య:- సందేహమా తల్లీ..

 

రాధ:- ఏవిధమైన సందేహమూలేదు. కాబట్టే నిన్నడుగుతున్నాను. రవి యెటువంటివాడు?

 

నరసయ్య:- నువ్వేచూస్తున్నావు గదా తల్లీ.. అతనిపై నీకున్న జాలివల్లనోఅభిమానంవల్లనో మీరున్న యీ రూంలోనే వుంచుకొని పనినేర్పి ఆదరిస్తున్నారు. మీ ఆదరనికి పాత్రుడైన వాడు మంచివాడని వేరే చెప్పాలామ్మా?

 

రాధ:- తాతా! ఆనాడతడొక మాటన్నాడు. నాతండ్రి యెవరో నాకు తెలియదు. తెలుసుకోవాలనికూడా నాకులేదు. అదినాతప్పాఅన్నాడు. అతనిమాట నిజమేగదా?

 

నరసయ్య:- అక్షరాల నిజమమ్మా. అతడుండేది మావీధి లోనే. వెధవలెంతోమంది  అతన్ని కులంమతంజాతీలేని బేవార్సాగాడని గేలిచేస్తే. మౌనంగా సహించాడేగాని. తల్లిని ఒక్కనాడైనా నిందించి యెరుగడు. మోసపోయిన తనతల్లిపై జాలిచూపాడు. అండగా నిలిచాడు.

 

రాధ:- తాతా యెవరైనా తను ఒకచోట పుట్టాలనితననిర్ణయం ప్రకారం పుడుతున్నారాలేదు కదాఅలానే రవి ఓతల్లికి జన్మించాడు. అతడు త్రాగుబోతాతిరుగుబోతాదొంగా?

 

నరసయ్య:- కాదు తల్లీ కాదు. అతడు బీడీ సిగరెట్ కూడా ముట్టడు.

 

రాధ:- మరి  లోకం అతన్ని హీనంగా చూడం సబబు కాదుగదా?

 

నరసయ్య:- నిజం చెప్పావమ్మా.. నిజానికి రవి తెలిసి యేతప్పూ చేయలేదుచేయలేడుకూడా.

 

రాధ:- ఇప్పుడు నువ్వూనేనూ ఒకేవిధంగా ఆలోచిస్తున్నాము. తాతా నేను నీ పెంపకంలో యీవిధంగా తీర్చిదిద్దబడ్డాను. కనుకనే ధర్మబద్ధంగా ఆలో చిస్తున్నాను. అందుకే నీతో నమనసులోని మాట చెబుతున్నాను. విను.

 

నరసయ్య:- చెప్పుతల్లీ..

 

రాధ:- నేను రవిని ప్రేమిస్తున్నాను. ఫోటోలను చూసిగాక మనిషి వ్యక్తిత్వాన్ని మంచితనాన్నీ చూసి ప్రేమిస్తున్నాను. పెండ్లి చేసుకుంటాను.

 

నరసయ్య:- అమ్మా!..(ఆశ్చర్యపడి) అంతదూరంవెళ్ళకు. నీవు చూపిస్తున్న అభిమానం చాలు. బాగా ఆలోచించు. మీనాన్న నిన్ను ప్రాణంగా చూసు కొంటున్నాడు. ఆయన మనసు నొప్పించకుతండ్రి చెప్పినట్లు నడుచుకో. రవికి గంతకుతగ్గ బొంత దొరక్కపోదు. అతడిప్పుడు నూనతతో జీవిచడం లేదు. ధైర్యంచెప్పి మనిషిని చేశారు. అదిచాలు. ఇంతకుమించి త్యాగం వద్దు తల్లీవద్దు.

 

రాధ:- తాతా! మనుషులకు కేవలం సానుభూతిచాలదు. తమవిశ్వాసాలను అమల్లో పెట్టాలి. అప్పుడే జీవితాలు సార్థకమౌతయి. ఐనా నేను రవిని జాలితో పెళ్ళిచేసుకోవడంలేదు. నాకు నచ్చిన గుణాలున్నాయి గనుకనే పెండ్లి చేసుకోదలిచాను. ఒక్కమాటయీఫోటోల్లోని పెండ్లికొడుకులు రవిని మించిన గుణవంతులై వుంటారావుండనివ్వండి. పర్వాలేదు. నాకు రవి నచ్చాడునేనతన్నే పెండ్లిచేసుకుంటాను.

 

నరసయ్య:- నీవు చిన్నపిల్లవు. నీకు తెలియదు తల్లీ. నామాటవిను. నీవనుకొన్నట్లు జరుగదు. ఇది ప్రపంచం. దీనికి తగ్గట్లే మనంపోవాలి. తప్పదు. నీ ఆలోచన మార్చుకోతల్లీ.

 

రాధ:- నేనుమార్చుకోను. ఏంఎందుకుమార్చుకోవాలి. రవిని నేను వివాహమాడటంలో తప్పేముంది. అతడు ఏ దురలవాట్లూ లేనివాడు. స్త్రీలయెడ  నిజమైన గౌరవంగలవాడు. ఆస్తిఅంతస్తుపై ఆశలేనివాడు. పదిమందికీ సాయపడాలనే మంచిబుద్ధి గలవాడు. ఇంకేం కావాలి. డబ్బా అదినాదగ్గరుంది. ఆడబ్బు మా తండ్రి నాకు దక్కనీయకపోవచ్చు. పోనివ్వండి. పరవాలేదు. నా నిర్ణయంలో నిజంగా తప్పుంటే చెప్పుతాత.

 

నరసయ్య:- నీతో వాదించే శక్తి నాకు లేదు తల్లీ.. కానీ మీనాన్నకు కాస్తా నిదానంగా శాంతంగా నచ్చజెప్పుఆతర్వాత ముందుకడుగేయ్.

 

రాధ:- సరే అలాగేచేస్తాను. కానీ ఆయన ఒప్పుకున్నాకాదన్నా నావివాహం మాత్రం రవితోనే. ఇంతలో తాతా నానిర్ణయం రవికి తెలియ జేయి. అతని ఉద్దేశ్యం తెలుసుకో. ఇప్పుడు నువ్వు రుక్మిణీకృష్ణుల మధ్య వివాహానికి పాటుబడిన అగ్నిద్యోతనుడను బ్రాహ్మణుని పాత్ర నిర్వహించు. మంగళప్రదమైన నా సందేశాన్ని అతనికందించి ఒప్పించు. అదిగో నాన్నగారూ ఆ పెళ్ళిళ్ళపేరయ్యా వస్తున్నారు. ఇకనువ్వెళ్ళు.

 

నరసయ్య:- అలాగే తల్లీ.. (వెళ్ళును)

 

పేరయ్య:- అదండి సంగతి. ఇక మీదేఆలస్యం. వస్తానుమరి.

 

భూపతి:- (దక్షిణనిస్తూ) ప్రస్తుతానికిదుంచండి. తర్వాత మీరే సంపూర్ణంగా సంతృప్తి పడతారు. సరేనా?

 

పేరయ్య:- మీ విషయంలో నాకు సందేహమేలేదు. మంచిది ఇక వెళ్ళివస్తాను.

 

రాధ:- పేరయ్యగారూ.. ఇవిగోండి ఫోటోలు. మూడుసంబంధాలూ బాగానేవున్నాయ్. కానీ నాకో నెల టైమివ్వండి. ఇంతలో వీళ్ళకు సంబంధాలు కుదిరితే కుదరనివ్వండి. మించిపోయిందిలేదు. ఏసంబంధమైనా మీకుమాత్రం సంతృప్తికరమైన సంభావన లభిస్తుంది. కనుక మీరు హ్యాపీగా వెళ్ళిరండి.

 

భూపతి:- రాధా! యేమిటమ్మా నీవనేది?

 

రాధ:- ఒకనెలేగదా నాన్నా నేనాగమంటున్నది. ఇంతలో యేమౌతుంది. పేరయ్యగారూ తమరువెళ్ళిరండి.

 

పేరయ్య:- సరేనమ్మా.. మీయిష్టం. ఇక నేను ఓమాసమాగి తిరిగీ తమదర్శనం చేసుకుంటాను. వస్తానమ్మా.

 

రాధ:- మంచిది వెళ్ళిరండి.(పెరయ్య వెళ్ళును)

 

భూపతి:- నెలరోజులాగమనడానికి కారణమేమమ్మా?

 

రాధ:- అంతా నేను రాత్రికి వివరించి నా మనసులోని మాట చెబుతాను. మనం సావధానంగా ఆలోచించి ఒకనిర్ణయానికొచ్చి ఆతర్వాత పెండ్లిళ్ళ పేరయ్యతోనోవివాహాలవీరయ్యతోనో సంప్రదించాలో లేదో చూద్దాం.

 

భూపతి:- నీ మనసులో యెవరైనా వున్నారామ్మా..

 

రాధ:- అవన్నీ రాత్రి భోజనానంతరం ప్రశాంతంగా మాట్లాడుకొందాం నాన్నా.

 

భూపతి:- సరేనమ్మా.. నీయిష్టం. అలాగే మాట్లాడుకుందాం.

 

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

 

 

(రాధరవి వారివారి సీట్లలో కూర్చొని పనిచేసుకోంటూ వుంటారు)

 

రాధ:- సాయంత్రం ఐదున్నర దాటింది ఆఫీసుటైం అయిపోయింది. నరసయ్యతాతతప్ప అందరూ వెళ్ళిపోయారు. మనం అలా పార్కుకు వెళ్ళి మాట్లాడు కుందామాఆ అవసరం వుందికదా?

 

రవి:- పార్కుదాకాయెందుకూ ఆ మాట్లాడుకొనే రెండు మాటలేవో యిఇక్కడే మాట్లాడుకోవచ్చుగదా?

 

రాధ:- సరే.. నరసయ్యతాత అంతా నీకు చెప్పాడనుకుంటాను.

 

రవి:- చెప్పాడు. చెప్పాడనడంకంటే నచ్చజెప్పాడనడం మంచిది రాధగారూ..

 

రాధ:- అయితే నన్ను పెండ్లాడటం మీకు యిష్టమే నన్నమాట.

 

రవి:- ఒక్కమాట.. నాకైతే యెవరూలేరు. మీకు మీనాన్నగారున్నారు. ఆయనకీ విషయం తెలియటం అవసరం గదా?

 

రాధ:- రాత్రే యీ విషయం మానాన్నగారికి చెప్పాను. మొదట ఒప్పుకోక పోయినాతర్వాత ఒప్పుకోకతప్పలేదు. సరేనన్నారు. కానీ ఆయన మనస్తత్వం నాకు బాగా తెలుసు. అందుకే నేనాయనమాటనమ్మడంలేదు. నాపెళ్ళి భగ్నం చేయడానికి యేదోఒకటి చెయ్యకపోడు. ఆయన ఆపని మొదలుపెట్టేలోపే నాపెళ్ళి జరిగిపోవాలి. అర్జెంట్ పనిమీద హైదరాబాద్ వెళ్ళారాయన రెండురోజుల్లో తిరిగొస్తారు.

 

నరసయ్య:- (వస్తూ) నేనంతా విన్నానమ్మా.. నాన్నగారికి యిష్టంగాని యీపెళ్ళి ..

 

రాధ:- జరుగుతుంది.

 

రవి:- ఏలా?

 

రాధ:-నాకూ నీకూ యిష్టముండాలిఅదొక్కటిచాలుపెళ్ళికి యింకే ఆటంకాలూ వుండవు. నాకు పెళ్ళి ఆర్భాటంగాజరగడం యిష్టంలేదు. రామాలయంలో రేపే మనం పెళ్ళిచేసుకుందాం. నా స్నేహితులిద్దరొస్తారు. నరసయ్యతాతా వుంటాడు. పెళ్ళి సలక్షణంగా జరిగి పోతుంది. ఆతర్వాత మానాన్నకెలాగూ తెలిసిపోతుంది. అంతగానైతే నెనేచెప్పేస్తాను. అప్పు డాయన అంగీకరించక తప్పిందికాదు. మొదట కోప్పడొచ్చు.  అతర్వాత సర్దుకపోతారు.

 

నరసయ్య:- తనమనసులోని మాట తండ్రికి చెప్పేసింది రాధ. యిక తప్పేమీలేదు. కానీ భూపతిగారు బలవంతం పెళ్ళికి పాల్పడవచ్చు. ధనవంతుడూపలుకుబడికలవాడు. ఏమైనాచేయవచ్చు. ఆతర్వాత అమ్మయి యిష్టం లేనివానితో జీవితాంతం బాధపడవలసివస్తుంది. ఆయనకంటే ముందు మనమే తొందరపదాల్సిన అవసరముంది.

 

రవి:- రాధా.. నీవు తొందరపాటుతో పొరపాటు చేస్తున్నవేమో మరొకసారి ఆలోచించు. నేనాలోచించాల్సిందైతే యేమీలేదు. నాకున్నదేమీలేదు కనుక పోయేదేమీలేదు. నీవా సుకుమారంగా పెరిగినదానివితండ్రికి యెదురు తిరిగి కష్టాలు కొనిచెచ్చుకొంటున్నావేమోబాగా ఆలోచించుకో.

 

రాధ:- నేనిప్పటికే ఒక దృడనిశ్చయాని కొచ్చాశాను. నేను నీకుతోడుండాగా భయపడాల్సిన పనేలేదు. మానన్న నన్ను విడిచి వుండలేడు. పెళ్ళంటూ ఐపోతే ఆయన సర్దుబాటు చేసుకుంటాడు. ఆనమ్మకంనాకుంది. సర్దుబాటు చేసుకోకపోయినా పరవాలేదు. నేను యేపరిస్థితి నైనా యెదుర్కోవడానికి సిద్ధంగా వున్నాను.

 

రవి:- సరే.. ఇక నీ యిష్టమే నాయిష్టం.

 

రాధ:- నరసయ్యతాతా.. మీరువెళ్ళి రేపటి నాపెళ్ళికి అన్ని యేర్పాట్లూ చేయండి. రామలయం పూజారితో వివరాలుచెప్పి రేపుదయం ఐదున్నర గంటలకు సిద్దంగా వుండండి. అందరం అక్కడే కలుసుకుందాం.

 

నరసయ్య:- సరేనమ్మా.. శుభం.. కల్యాణమస్తూ.. (ఇద్దరినీ దీవిస్తాడు)

 

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

 

(రాధరవి వారివారి సీట్లలో కూర్చొని వుంటారు)

 

రవి:- ఆఫీస్‍టైం ఐపొయింది. ఈరోజుమనం అలా సరదాగ పార్కుకెళదామా?

 

రాధ:- ఏమిటీ యింతకముందు నేను పార్కు కెళదామంటే వద్దనేవాడివి యిప్పుడు నువ్వే వెళదా మంటున్నావ్.

 

రవి:- అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఇప్పుడెవరేమనుకున్నా ఇబ్బందిలేదు. పదవెళదాం. సరేగానీ ఆ తాళి బయటికి కనిపిస్తూంది కాస్తా సర్దుకో.

 

రాధ:- ఓ.. సరేలేండియింకెన్నినాళ్ళుతొందరలోనే యీ యిబ్బందీ తీరిపోతుంది.(సర్దుకొని) వెళ్ళి ముఖంకడుక్కొని చీరమార్చుకొనొస్తాను. అగండి.

 

రవి:- అవసరంలేదు. ముందు మనింటికెళదాం. రిపేర్లన్నీ పూర్తయ్యాయ్బాగుంది. ఎవరైనా చూస్తే అది నాయిల్లని గుర్తు పట్టలేరసలు. మనిద్దరం కలసి యిల్లుబాగుచేయించుకున్నాంఅసలది కొత్తిల్లులాగే వుంది. అక్కడికెళ్ళి తయరై పార్కుకెళదాం. అట్లే హోటల్‍కెళ్ళి కలిసి భోంచేద్దాం. సరేనా..

 

రాధ:- సరే.. అలాగే వెళదాం. పతిదేవులమాట సతి కాదనగలదా? (ఇద్దరూ నవ్వుతూ వెళ్ళుదురు)

 

భూపతి:- (పేరయ్యతో కలిసి వస్తూ) విషయమంతా వివరంగాచెప్పాను. మిమ్మల్ని మిగిలిన విషయాలు ఆరాతీయమన్నాను. ఇంతకూ యేంజేశారు.

 

పేరయ్య:- ఆరాతీశానుమీ గుమాస్తాగాడు ఓ బేవారస్. తల్లిపేరు యశోదమ్మ. ఆమెకు పెళ్ళికాకుండానే వీడు పుట్టాడు. ఆమెకూడా లేదుచనిపోయింది. ఓఐదారెళ్ళక్రిందట  రాజాపురం శివార్లలో కమ్యునిష్టులు ఖాళీస్థలాల్లో గుడిశలేయించారు. జ్ఞాపకముందా?  ఆ గుడిశాల్లో ఒక గుడిశ వీడిది.ఈమధ్యనే అదికాస్తా రిపేరు చేయిచుకొని మురిసి పోతున్నాడు. మరోవిషయం యీమధ్య మీఅమ్మయితో క్లోజ్‍గా తిరుగుతున్నాడు. పరిస్థితి చేజారకముందే జాగ్రత్తపడండి.

 

భుపతి:- నిజమేనయ్యా. నాకూతెలుసు.  కానీ యేంచెయ్యను.  అమ్మాయి మాటవినడంలేదు. చూస్తూ చూస్తూ వానికెలాగయ్యా పిల్లనివ్వడం.

 

పేరయ్య:- వివరాలన్నీ చెప్పి చూడు. నరసయ్య మాటవింటుందని అన్నట్లు జ్ఞాపకం. ఆయనతోనూ ఒకమాట చెప్పించండి.

 

భూపతి:- అన్నీ అయిపోయాయి. ఆ నరసయ్యా అమ్మాయివైపే మాట్లాడుతున్నాడు. నాకు గత్యంతరమేలేదు. బిడ్డను ఆ దిక్కుమాలినవాడికే యివ్వకతప్పదేమో.

 

పేరయ్య:- అధైర్యపడకండి. ఇటువంటి కేసులేన్నోచూశా.. ఇట్టే పరిష్కారం చూపించా. చూడండీ.. అమ్మయిని మోసగించిపెండ్లికొడుకువైపువారికి విషయాలు దాచిపెట్టిపెండ్లిచేయడం మీవిషయంలో కష్టమే. అమ్మయిని కిడ్‍న్యాప్‍చేసి పెండ్లికొడుక్కి ఆశచూపి బలవంతంపెండ్లి చేయాలి. అలావచ్చే అల్లుడు యెటువంటివాడైవుంటాడో మీరూహించుకోవచ్చు. కనుక యిది మనకు సరిపోదు. వద్దు.

 

భుపతి:- మరేంచేయమంటారు?

 

పేరయ్య:- అదేచెబుతున్నా.. యిది కాస్తా ఖర్చుతో కూడుకున్న పని. అందుకు తగ్గ రిస్క్‍కూడా యిందులో వుందిమరి.

 

భుపతి:- ఖర్చెంతైనా పరవాలేదు. చెప్పు.

 

పేరయ్య:- ఇటువంటి విషయాలు యింట్లోకెళ్ళి మీ బెడ్‍రూంలో మాట్లాడుకోవడం మంచిదేమో?

 

భూపతి:- లేదులేదు యిదే సేఫ్ ఇక్కడికెవ్వరూరారు. నిర్భయంగా మాట్లడుకోవచ్చు.

 

పేరయ్య:- సరే విను. ముందు ఆ రవిని లేపేద్దాం.

 

భుపతి:- ఆఁ..

 

పేరయ్య:- భయపడకు.. దిక్కులేని పక్షి. వాణ్ని లేపేయడమేమంత కష్టంకాదు. తర్వాత వాణ్నిగురించి ఆలోచించేవారుకూడా వుండరు. యీజీ కేస్.

 

భూపతి:- ఆతర్వాత..

పేరయ్య:- ఆతర్వాత నీ కూతురే నోరెత్తకుండా మనం జూపెట్టిన వాణ్ని పెడ్లిజేసుకుంటుంది. పాతకథ సమాప్తం. ఇదే మనకున్న యేకైక పరిష్కారం. నాకిదేమంత కష్టమైన పనికాదు. ఇటువంటివెన్నోచేశా.. ఇటువంటి పనుల్లో నాది అందెవేసినచేయి. అనుభవంతో చెబుతున్నా. ఇకనీయిష్టం. ఖర్చు లకారాల్లోవుంటుందిమరి.

 

భూపతి:- పరవాలేదు. నాబిడ్డకోసంనా పరువుకోసం యెంతైనా ఖర్చుబెడతాను. ఆ యేర్పాట్లు చేసేయ్. వెధవ! వానికి నాకూతురే కావలసి వచ్చిందావానికి తగిన శాస్తి జరగల్సిందే. ఇదిగో అడ్వాన్స్ పని కానిచ్చేసెయ్ (నోట్లకట్ట అందిస్తాడు)

 

పేరయ్య:- సరే.. మీరింక నిశ్చింతగా వుండండి. అమ్మయి మాటలకు సరే నంటూ సమయంగడపండి. ఆపనిచేసే ట్రూప్ ముంబాయ్ వెళ్ళింది. రాగనే అమౌంట్ డిసైడ్ చేసి వచ్చి మాట్లాడతాను. అప్పుడు పూర్తి డబ్బు యిచ్చే యండి. పని ముగించడం నాదీ బాధ్యాత. మీరింక రిలాక్స్‍యిపోండి.

 

భూపతి:- ఇప్పటికే యేవేవో మాటలుచెప్పి ఐదునెల్లు గడిపాను. ఇంకా ఆగడం కష్టం. పని తొందరగా ముగించేయ్. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి విషయం చూడాలి. అదీ తొందరగా కానివ్వాల్సిందే.

 

పేరయ్య:- సరే.. ఇకచూసుకోండి నాపనితనం (స్టేజ్ స్టిల్ అవుతుంది)

 

లైట్స్ ఆఫ్ & ఆన్

 

(భూపతిరాధనరసయ్య వాళ్ళ వాళ్ళ స్థానాల్లో  కూర్చొని వుంటారు)

 

రాధ:- మధ్యాన్నమౌతూందిరవి ఇంకా రాలేదు. నాతోనూ యేంచెప్పలేదు. సెలవూ పెట్టలేదు. మికేమైనా ఫోన్‍చేసి చెప్పరానాన్నా.

 

భుపతి:- లేదమ్మా.. నాకేంచెప్పలేదు.. ఏదైనా ముఖ్యమైన పనిబడిందేమో..

 

నరసయ్య:- నిన్న రాత్రికూడా యింటికాడ లేడమ్మా. ప్రొద్దున కూడా కనబడలేదు.

 

రాధ:- నాకుచెప్పకుండా ఎక్కడికీ వెళ్ళడు. యేదో జరిగింది. నాకూ జెప్పకుండా.. ఆఫీసుకూ రాకుండా.. ఏక్కడికెళ్ళుంటాడు..

 

భుపతి:- ఏమిటమ్మా నువ్వుమరీన్ను.. అతడేంపసిపిల్లవాడాఅతని పనులతనికుంటాయ్. ఒకరోజతడు ఆఫీసుకు రాకుంటే యేమైంది. ఇంతసీరియస్‍గా తీసుకుంటేయెలా? (ఫోన్ మ్రోగుతుంది)

 

నరసయ్య:- (ఫోన్ తీసుకొని) హలో.. ఔను యిది భూపతిగారి ఆఫీసే... ఆఁ నేను నరసయ్యనే ... ఆఁ ఎంతపని జరిగింది. రవిని చంపేశారా?

 

రాధ:- (వచ్చి ఫోన్ లాక్కొని) ఏమిటీ... రవి చనిపోయాడా? ..... పాడుబడిన బావిలో డేడ్‍బాడీ వుందా? (ఫోన్ జారవిడిచి క్రింద పడిపోవును భూపతివచ్చి ఆమెను పట్టుకొనును నరసయ్య పోన్ అందుకోని వివరాలు వింటూవుంటాడుభూపతి రాధను పడుకోబెట్టి గ్లాసుతో నీళ్ళుతెచ్చి ముఖంపై చల్లును ఆమెతేరుకొనును.)

 

నరసయ్య:- అయ్యగారూ.. ఎవరో రాత్రే రవిని చంపేసి వూరిచివర పాడు బడినబావిలో పడేశారు. పోలీసులకు విషయం తెలిసివచ్చీ శవాన్ని పోష్టు మార్టంకు పంపుతున్నారట. విషయం తెలిసి మా వీధివాళ్ళు నాకు ఫోన్ చేశారు.

 

రాధ:- రవికెవరూ పగవారు లేరు. అసలాయన్ని హత్యచేసేటంత అవసరం కూడా యెవరికీ లేదు. (కోపంతో) నాన్నా.. మీరేయేదో చేసివుంటారు (దగ్గరికెళ్ళి తండ్రిచేయి తన తలపై పెట్టుకొని) నాపై ప్రమాణం చేసిచెప్పండి. చెప్పండి మీరీ హత్యచేయించలేదని చెప్పండి.

 

భుపతి:- అమ్మా.. రాధా..

 

రాధ:- చెప్పలేరుకదూ! మీరుచెప్పలేరుయెంతపని చేశారునాన్నా.. చేజేతులా మీ అల్లున్ని మీరే హత్యచేయించారు. ఎంత అన్యాయంయెంతఘోరం. (బోరున యేడ్చును)

 

భూపతి:- (షాక్కు గురై) అతను.. అతను నాకు అల్లుడేంటమ్మా.. అతనికీ మనకూ యేసంబంధమూలేదు. నీవనవసరంగా బాధపడకు. జరిగిందేదో ఒకరకంగా మనమంచికే జరిగింది. ఐనా అతడు చనిపోయాడంటే నాకూ బాధాగానేవుంది. దానికి మనమేంచేద్దాం. నువ్వు మరీయింతగా యేడ్వడం పదిమందీ చూస్తే బాగుండదు. పెళ్ళికావలసినదానివి. ఊరుకో.

 

రాధ:- పెళ్ళికావలసినదాన్ని కాదు. పెళ్ళయిన ఇల్లాలిని. రవి నా భర్త. భర్తపోయిన యిల్లాలు యేడ్వకేంజేస్తుందినాన్నా.. ఏడ్వకేంజేస్తుంది.

 

భూపతి:- రాధా! ఏమిటి నీవంటున్నది?

 

నరసయ్య:- ఔనయ్యగారు. రవికి రాధకూ పెళ్ళయింది. నిన్నూ నీ మాటను నమ్మలేకరవివిషయం నీకు చెప్పిన మరుసటిరోజే గుళ్ళో పెళ్ళిజేసు కొంది. నీకీ విషయం చెప్పడానికి రోజూ ప్రయత్నం జెస్తూనేవుంది. మీరు పెళ్ళివిషయమనగానే దాటేస్తూ వస్తున్నారు.

 

రాధ:- నాన్నా.. నువ్వు నాకు మరోసంబంధం చూస్తావని పెళ్ళి బలవంతంగా చేస్తావనిరవిని యిక్కడినుండి తరిమెస్తావనీ అనుమానించానేగానియింతదారుణానికి పూనుకుంటావనుకోలేదు. నీయెత్తుకు పైయెత్తు వేశానని సంబరపడిపోయానేగానిఅన్యాయంగా ఒక అమాయకుణ్ని చంపించ బోతున్నానని తెలుసుకోలేకపోయాను నాన్నా.. తెలుసుకోలేక పోయాను. నీకుతెలుసానాన్నా.. ఇప్పుడు నేను గర్భవతిని.

 

భూపతి:- అమ్మారాధా.. ఎంతపనిచేశావమ్మా.. ఈవిషయం నాకు ముందు తెలిసుంటే యింతపని జరిగుండేది కాదుగదమ్మా. (కొంత ధైర్యం తెచ్చు కొని) సరే నీదారిలో నువ్వునాదారిలోనేనూ యిద్దరం తప్పుచేశాం. భయపడకు. నాకు తెలిసిన డాక్టరున్నాడు. అతడు నాకు మంచి స్నేహితుడు. గుట్టురట్టుగాకుండా అబార్షన్ చేసేస్తాడు. నీ బ్రతుకును అల్లరిచేసుకోకుండా ఊరకుండు. వాణ్ని మరచిపో. అన్నీ నేను సర్దు బాటుచేస్తాను. నీకోమంచి సంబంధంచూసి మళ్ళీ పెళ్ళిచేస్తాను. నీ జీవితానికి ఓ మంచి దారి చూపిస్తాను. నామాట వినుతల్లీనేను నీ తండ్రినినీమేలుగోరి చెబుతున్నాను. నామాటకాదనకు.

 

రాధ:- హ.. అసలు మీ ప్లానే యిదికదునాన్నా.. అంతా నీవనుకున్నట్లే జరగదు. " నీకేం భయంలేదు నేనున్నా" నని ధైర్యంచెప్పి నాభర్తను నా తండ్రినుండి కాపాడుకోలేకపోయను. పాపమతనికి లేనిపోని ఆశలు కల్పించి ప్రాణాలు పోగొట్టుకొనేట్లు చేశాను. చేసిన అన్యాయంచాలు. నా భర్తకింకా ద్రోహం చేయలేను. నీ దుర్మార్గాన్ని బట్టబయలుచేసి నీకు శిక్షవేయించే శక్తి నాకులేకపోవచ్చు. కానీ నాబ్రతుకు నేను బ్రతకడనికి నిన్ను అడ్డుపడనీయను. నేను చచ్చేంతవరకూ రవిభర్యగానే బ్రతుకు తాను. నేను బిడ్డను కంటాను. కనితీరుతాను. నాభర్తప్రతిరూపాన్ని యీ లోకంలో తలెత్తుకొని బ్రతికేట్టు తీర్చిదిద్దుతాను. నీవునన్ను బిడ్డవన్నాఅనకపోయినానేను మాత్రం రవిచేత తాళిగట్టించుకొన్న భార్య ననే చెప్పుకుంటాను. సరే.. ఈనాటితో మన తండ్రీ కూతుళ్ళబంధం తెగి పోయిందనే ఆనుకుంటున్నాను. రక్షణ లేనిచోట వుండటం మంచిదికాదు.. సెలవ్.

 

భూపతి:- ఆవేశంలో మాట్లాడుతున్నవుగానీ ప్రాక్టికల్‍గా ఆలోచించు. నీకు నేనుచూపించే దారితప్ప గత్యంతరమేలేదు. నిదానంగా అలోచిస్తే ఆంతా నీకే అర్థమౌతుంది.

 

నరసయ్య:- అయ్యగారూ ఇకచాలండి. చాలు. నారుపోసినవాడు నీరుపోయకపోడు. అమ్మా రాధా.. నీకునేనున్నను. నీవెంచుకొన్నది గొప్పధర్మమార్గం తల్లీ. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన గలవారికి అర్థం కాదమ్మా.. ఇక్కడమనమొక్క నిముషంకూడా వుండొద్దు పదపోదాం. నీకు నేనున్నాను. నీ నిర్ణయం మనుషులుకాదు దేవతలు మెచ్చుకొనే నిర్ణయం తల్లీ. పదపోదాంఅక్కడ నేనేకాదు మనసున్న మనుషులున్నారునీకొక యిల్లుంది. పశువులూ పక్షులూ జీవిస్తున్నాయి. మనం బ్రతకలేమాపద..

భూపతి:- నరసయ్యా.. నన్ను క్షమించయ్యా.. నావల్ల ఘోరం జరిగి పోయింది. నేను పాపినినిజంగా శిక్షార్హుణ్ని. కనీసం నీవైనా నన్ను క్షమించు. నాబిడ్డను నానుండి లాక్కెళ్ళకు. ఇవి చేతులుకావు (చేతులు పట్టుకొని యేడ్చును)

 

నరసయ్య:- భూపతిగారూ.. ఏమిటండీ మీ వెర్రి. నేను నీబిడ్డను తీసు కెళ్ళడమేమిటండి.  రాధే నిన్ను కాదనుకొని బయటికెళుతున్నది. నేను పెంచిన మమకారంతో ఆమెకు తోడుగా నిలబడ్డాను. అంత ధర్మాత్మురాలికి తండ్రి తోడుగా వుండాలిఅదెలాగూలేదుకనీసం నా అండకూడా వుండ కూడదా! ఆలోచించండి. నా అండ లేనంతమాత్రాన నీబిడ్డ నిర్ణయం మారదు. అది తెలుసుకోండి.

 

భూపతి:- (కస్తా ఆలోచించి) నాకర్థమైంది తల్లీ. నీవు చాలాగొప్పదనివి. నా ఊహకందనంత గొప్పదానివి. వెళ్ళమ్మా వెళ్ళు నరసయ్య దగ్గరే క్షేమంగా వుండు. నేను చేసిన కుట్రంతా పోలీసులకు చెప్పేస్తాను. కోర్టులో తప్పొప్పుకుంటాను. శిక్షననుభవిస్తాను. మిమ్మల్నిక బాధపెట్టనువెళ్ళండి (కన్నీరుపెట్టి తలదించుకొనును)

 

నరసయ్య:- చాలా మంచి నిర్ణయమే తీసుకున్నారు భూపతిగారూ. పాప ప్రక్షాళన కిదొక్కటే మార్గం. శిక్షానంతరం తిరిగిరండి అప్పుడాలోచిద్దాం.

 

రాధ:- నాన్నా..మీరు ఒక తండ్రిలేని నిరాధారయువకుని కథకు అంతం పలుకుదా మనుకున్నారు. కానీ అది దైవానికిష్టంలేదు. ఇదిగో నా గర్భంలోమరోఆత్మ జీవంపోసుకుంటున్నది. ఇది కథకు మరోనాంది. ఆంతంకాదిదఆరంభం.

                       

                            ఓం శాన్తి శాన్తి శాన్తిః

No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...