Thursday, 4 August 2022

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

 నాకు చదువు రాదు

(ఏకపాత్రభినయము) 
Books
 

(పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి )


అమ్మా! శారదా... (బోరున యేడ్చును). తల్లీ యీ గుడ్ది తండ్రిని విడిచి వెళ్ళిపోయవా తల్లీ.. భగవంతుడా వున్న ఒక్క బిడ్డనూ తీసుకబోయి నన్ను ఏకాకిని జేసినావానా బిడ్డ ఉరి పోసికోవడానికి నేనే.. నేనే కారణం చేతగాని దద్దమ్మ కడుపున పుట్టినందుకు నీకీగతి పట్టిందా తల్లీ..

పిల్లాపాపల తో అత్తారింట కళకళ లాడుతూ వుండాల్సిన నా బితపని జరిగుండేదే కాదుదేవుడా.. నాబ్రతుకెందుకింత బండల పాలుజేశావ్.. నాకర్మిలా కాలి పోయిందిపోనీవాళ్ళైనా యింత దయజూపించి,నాముఖానఉమ్మేసి కోడల్ని మనిషిగా చూడొచ్చుగదాఎందుకు చూస్తారూ.. వాళ్ళు ధన పిశాచులుఆడున్న మూన్నాళ్ళు నాబిడ్డను కాల్చుకతిన్నారుఇక లాభం లేదు యీ దౌర్భాగ్యుని చేతిలో  చిల్లిగవ్వకూడా లేదుదానికితోడు కళ్ళుకూడా పోగొట్టు కొన్నాడువీడివల్ల మనకేలాభమూలేదుఅంతేగాదు వీడు మనల్నేమీ చెయ్యలేడనుకొని నాబిడ్డను యింటినుండిగెంటేశారుమనుషులమాదిరి గనపడే దయ్యాలువాళ్ళుచేసేదిలేక నాబిడ్డ యీ గుడ్డి వాని పంచన చేరిందితినో తినకనోదానిమానన అది బ్రతుకుతూందికానీ యీ లోకం దాన్ని వదల్లేదుమొగుణ్ని వదిలేసిందనీయింకా యేమేమో నిందలు మోపింది.యీ లోకంలో యిక బతకలేక ఆఖరికి ఉరిపోసుకొంది. నేనూ బాగానే బతకాలనుకొన్నానునాతోటివాళ్ళందరికంటే దర్జాగా బతకాలనుకొన్నానుకానీ  నా  తెలివితక్కువతనం  నా   సోమరితనం నన్ను చీకటిలోనికి తోసేసినాయి మానాన్న నాకు కోటికిపైన్నే ఆస్తి అప్పజెప్పి పోయినాడు.కాని ఏంలాభంచదువూ సంధ్య లేనివానిచేతిలో లక్ష్మి నిలవదని పాపం ఆయనకు తెలీదుతెలిసివుంటే చిన్నతనంలోనే నన్ను మందలించి కొట్టి తిట్టైనా బడికి పంపి చదివించివుండేవాడునన్ను ప్రయోజకుణ్ని చేసుండేవాడునాకు బాగా జ్ఞాపకముంది రోజు బడి పంతులు నన్ను మందలించినాడు నాలుగు  రోజుల్నుండి  బడికిరాకుండా యెక్కడకూరేగావురా అని కోపగించుకున్నారు.

 నాలుగు తగిలించారుకూడనేను మానాయనకు లేనిపోనేటివి కల్పించి అయ్యవారిమీద తంటాలుచెప్పినామానాయన అయ్యవారిని పిలిచి తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి పంపించాడువెధవబడి వెధవయ్యవార్లు మానేయ్యర బడి అన్నాడుఅప్పుడు నాకు చాల సంతోషమేసిందిమానాన్న చాలామంచోడనిపించిందిబడిమానేసి బలాదూర్గా తిరిగానుసినిమాలన్నీ చూసి డైలాగులు చెప్పి కాలర్యెగేసి గొప్పనుకున్నానుచదువురాకుండనే గడ్డాలు మీసాలూ వచ్చేసినాయిపెద్దవాణ్ణయిపోయానుమావ్యాపారం మూడుపూలు ఆరుకాయలుగా వుందప్పట్లోఆదశలో మానాయన కన్నుమూసినాడుపగ్గాలు నాచేతి కొచ్చినాయిఆనాటినుంచే నాదశ వెనక్కు మళ్ళిందిభాగస్తులకు బాగా అర్థమైపోయిందినేను చదువురాని దద్దమ్మననివాళ్ళిష్టమొచ్చినట్లు లెఖ్ఖలు వ్రాసుకొన్నారుఇకనేముంది నాకు విషయం తెలిసేలోగానే దివాలా తీయించారుఅందరూ నన్నేతప్పుబట్టారునాకాశాస్తి జరగవలసిందేనన్నారుటవున్ వదిలి మాపల్లె చేరుకున్నానుమ్మాయికి వయసొచ్చిందిపెండ్లిజేయా లనుకొన్నానునానా యాతనలుబడి పెండ్లయిందనిపించానుకట్నం లో కాస్తా తక్కువచ్చింది. తర్వాత సర్డుబాటుచేస్తాని నచ్చజెప్పానుఅమ్మో వాళ్ళు పరమకిరాతకులుకట్నంకోసం  బిడ్డను పీడించడం మొదలుపెట్టారుఒకసంవత్సరంలో పల్లెలోవున్న రెండెకరాలూ అమ్మి వాళ్ల కిస్తానన్నానుకానీ నేనేంజేయను కట్టుకొన్నదానికి క్యాన్సరన్నారుఅమ్మిన రెండెకరాల డబ్బు ఆజబ్బు తినేసిందిడబ్బుతోపాటి ఆజబ్బు నా పార్వతినీ మింగేసిందిడాక్టర్లు తమదేమీ తప్పులేదన్నారుజబ్బు యింతగా ముదిరేవరకూ యెందుకు పట్టించు కోలేదని దండించారుగుండెలు పగిలేటట్లు యేడ్చానుఏనాడేగాని నోరు తెరచి నా కిదికావాలని అడిగియెరుగని ఇల్లాలుతను కడుపునొప్పితో గిజగిజ 

లాడిపోతూకూడా ఒకరితో చెప్పుకొనియెరుగదుడాక్టర్లు చెప్పింది తప్పు కాదువాళ్ళన్నదాంట్లో ఒక  అక్షరంకూడా అబద్దంలేదువంటసోడా దాని నోటగొట్టి కడుపునొప్పేం

జేస్తుందిపోతుంది లెమ్మని దాన్ని చేజేతులార నేనే చంపుకున్నానునేను పాపిని  మహాపాపిని.. హుఁ.. నా పాపం పండిందికాకపోతే నేనెందుకు  నాటు నారయ్య మాట వింటాను, వానిచేత నా రెండుకళ్ళూ సుక్లాలు తీయించుకొని వాని చేతగాని తనానికి  

కళ్ళుసుక్లాలు తీయించుకొని వాని చేతగాని తనానికి కళ్ళు పోగొట్టు కొంటానుఒరే ముందు ఒకకన్ను పొర తీయరా అదిబాగైతేరెండోదిఇంగో సారి చేయించుకుంటానంటే విన్నడా? ఎందుకయ్యా  రెండుసార్లు జేస్తే ఖర్చులెక్కువైతాయ్పైగా రెండుసార్లు పత్యముండాల అనివాడంటే నమ్మి అన్యాయంగా రెండుకళ్ళూ పోగొట్టుకున్నావాడునా రెండుకళ్ళూ చేతగాని వైద్యంతో పొడిచేసినాడునా ఖర్మ వాడినని యేంలాభంచదువురాని మొద్దునితెలివి తక్కువ వెధవనిఅక్షరాలురాని బుద్ధిహీనుణ్నిచదువు లేకపోవడంతో  చేతగానివాడినై  ఆస్తి పరులపాలు చేసినాబుద్ధిలేనివాడినై నా ప్రాణానికి ప్రాణమైన భార్యను మట్టిపాలుజేసినాతెలివితక్కువతనంతో రెండుకళ్ళూ పోగట్టుకున్నాఅమాయకు

రాలైన ఒక్కగానొక్కబిడ్డ నా దరిద్రానికి  బలైపోయిందిఎందుకూ యెవరికీ పనికిరాని యీ గుడ్డిబ్రతుకు భూమికేభారం(ఏడ్చును). గురుదేవామునిరత్నంసారూ!  నీ వానాడు కొట్టిన  బెత్తందెబ్బకే  మేలుకొనివుంటే యీనాడు జీవితంలో యిన్ని దెబ్బలు తినేవాణ్ని 

కాదుగదా.. తండ్రీ నీ కోట్లులక్షల ఆస్తి నన్ను ఉద్దరిస్తుందనుకొన్నావేగాని అక్షరంరానివాని చేతిలోని లక్షలు యెందుకూ దరుంగావని తెలుసుకోలేక పోయావు అన్నలారాతమ్ముల్లారామీరందరూ చూడండిచదువురానివాని జీవితం ఎట్లా కుక్కలుచింపిన విస్తరైపోయిందో చూస్తున్నారు గదాఆలోచించండిమీరూ మీపిల్లలూ జాగ్రత్తపడండినామాదిరి యెవరూ   జీవితాన్ని నాశనం చేసుకోకండి  జీవితంయికచాలు.  నాన్నా.. 

వస్తున్నా.. పార్వతీ నీదగ్గరికేవస్తున్నాఆఁ అదిగో నాబిడ్డ నాకు బాగాకనిపిస్తున్నది. 

 నన్ను రమ్మని పిలుస్తున్నదివస్తున్నానమ్మ వచ్చేస్తున్నా పార్వతీఅమ్మాశారదా

మీరంతా అక్కడుంటే ఇక్కడ నాకేంపని ఇదిగో వచ్చేస్తున్నా యిప్పుడేవచ్చేస్తున్నా.


 (క్రింద పడిపోవును.)


మాప్తం 

( కడప, అక్షరాస్యతా కార్యక్రమంలో  గౌర్నమెంట్ కాలేజి ప్రింపాల్  శ్రీ కాంబోజి సుబ్బారావుగారి  కోసం వ్రాసి యిచ్చినది ) 



* Naaku Chaduvu Raadu




 


 




 

 

No comments:

Post a Comment

నాకు చదువురాదు, Naaku Chaduvu Raadu

  నాకు   చదువు   రాదు ( ఏకపాత్రభినయము )     (పాత్ర: ఓ 50 సంవత్సరాల  పేద పెద్దమనిషి ) అమ్మా!  శారదా ... ( బోరున   యేడ్చును ).  తల్లీ   యీ   గ...